ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ - Education PS Inspection - EDUCATION PS INSPECTION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-03-2024/640-480-21054138-thumbnail-16x9-education-principal-secretary-praveen-prakash-inspection-in-govt-primary-schools-anantapur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 2:07 PM IST
Education Principal Secretary Praveen Prakash Inspection in govt Primary Schools Anantapur : అనంతపురం నగరంలోని ప్రాథమిక పాఠశాలలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించారు. అనంతపురంలోని చిన్న శారద నగరపాలక పాఠశాల, కేఎస్ఆర్ పాఠశాలలను తనిఖీ (Inspection) చేశారు. పాఠశాల నిర్వహణపై ఉద్యోగులను ఉపాధ్యాయులను (Teachers) ప్రశ్నించారు. మొదటి రోడ్డులో ఉన్న ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న అంశంపై ఉద్యోగులను నిలదీశారు. సమీపంలోనే ప్రభుత్వ భవనం ఖాళీగా ఉన్నా ప్రైవేటు భవనం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
Education Principal Secretary Fires On Employees : ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా విద్యార్థుల చదువుకు ఉపయోగించాలని సూచించారు.నిర్వహణ లోపం కనిపిస్తే చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని హెచ్చరించారు. విద్యార్థులుకు అన్ని సౌకర్యాలు (Facilities) అందేలా చూసుకోవాలని సూచించారు. పలు అంశాలపై ఉద్యోగులతో చర్చించారు. సర్కారు సొమ్మును పూర్తిగా విద్యార్థుల పురోగతికే వాడాలని సూచించారు. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉపాద్యాయులు సమయ పాలన పాటించాలన్నారు.