ఆకట్టుకుంటోన్న 'సీడ్ గణేశ్​ల' ప్రతిమలు - పర్యావరణహిత విగ్రహాల తయారీ - Eco Friendly Seed Ganesha - ECO FRIENDLY SEED GANESHA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 7:10 PM IST

Eco Friendly Seed Ganesha Idols In Siddipet : ఈ వినాయక చవితికి మాజీ ఎంపీ సంతోశ్​కుమార్‌ మరో వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. 'సీడ్‌ గణేశా' పేరుతో ఈ సారి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీడ్‌ గణేశ్‌ల ప్రతిమలను ఆయన ఆవిష్కరించారు. మట్టి,కోకో పౌడర్‌తో తయారుచేసిన ఈ విగ్రహాలు తయారుచేసినట్లు సంతోశ్ వెల్లడించారు. వినాయక ప్రతిమ తయారీ సమయంలో విగ్రహంలో మర్రి, చింత వంటి గింజలను ఉంచామని తెలిపారు.

నిమజ్జనం చేసేటప్పుడు ఆ 'సీడ్ గణేశ' ప్రతిమను గుంతలో కానీ బురదలో కానీ ఉంచాలని సంతోశ్ సూచించారు. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆ విగ్రహంలోని గింజలు నుంచి మొక్కలు ఎదుగుతాయని ఆయన వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పర్యావరణ హితమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా సంతోశ్ కుమార్ తెలిపారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.