ఎండ తీవ్రత ఎఫెక్ట్ - డంపింగ్ యార్డ్లో మంటలు - Fire Incident at Medak Dumping Yard - FIRE INCIDENT AT MEDAK DUMPING YARD
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-04-2024/640-480-21352442-thumbnail-16x9-fire-accident.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 30, 2024, 4:03 PM IST
Dumping Yard Fire in Medak : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. అవసరమైతే తప్ప బయటకి రావొద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఉష్టోగ్రత పెరగడంతో చిన్న చిన్న వస్తువులు నిప్పులు చెరుగుతున్నాయి. అలానే మెదక్ జిల్లాలో డంపింగ్ యార్డ్లో చెత్త తగలబడిపోతుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Dumping Yard Incident in Medak : మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అగ్గి రాజుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీలు పెట్టి మంటలు అంటుకోలేని చెత్తను వేరు చేస్తున్నారు. దీంతో పాటు వాటర్ ట్యాంకర్లతో మంటలను ఆపుతున్నారు.