జోరువానలో 2 కిమీ గర్భిణీ నరకయాతన - చివరకు కవలపిల్లల జననంతో కథ సుఖాంతం - Family Carried pregnant to 2 km
🎬 Watch Now: Feature Video
Published : Aug 7, 2024, 5:22 PM IST
Family Carried Pregnant woman For Hospital : ఒక వైపు జోరువాన, మరోవైపు పురిటి నొప్పులు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమైన చర్లలో ఓ గర్భిణీ ఆవేదన వర్ణణాతీతం. దేవుడి దయ, కుటుంబసభ్యుల సహకారంతో చివరకు ఆ గర్భిణీ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెం గ్రామం నుంచి లోపలికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో బూరుగుపాడు అనే ఆదివాసి గ్రామం ఉంది.
రవ్వ ఉంగి అనే గర్భిణీకి ప్రసవ నొప్పులు రావడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డంతా బురదమయం కావడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులే మంచానికి జట్టి కట్టి జోరు వానలో బురద రోడ్డులో రెండు కిలోమీటర్లు మోసుకొచ్చారు. తారు రోడ్డు వరకు వచ్చాక 108 వాహనంలో సత్యనారాయణపురం పీహెచ్సీకి తరలించారు. ఆసుపత్రిలో రవ్వా వుంగి కవల పిల్లలకు జన్మనిచ్చింది. తమ గ్రామానికి తారురోడ్డు ఉంటే వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు వచ్చేవి కావని బూరుగుపాడు గ్రామస్థులు వాపోతున్నారు.