'ఉద్యోగమంటూ నన్ను దుబాయ్ ఎడారిలో వదిలేశారు' - 'గోట్​ లైఫ్' మూవీని తలపించే ఘటన - DUBAI JOB FRAUD NEWS - DUBAI JOB FRAUD NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 10:31 AM IST

Man Stuck In Dubai Desert Seeking Help Video : గోట్‌ లైఫ్‌ సినిమాను తలపించే ఘటన నిర్మల్‌ జిల్లాకు చెందిన వ్యక్తికి ఎదురైంది. ముధోల్ మండల రువ్వి గ్రామానికి చెందిన రాఠోడ్ నాందేవ్ అనే వ్యక్తి పది నెలల కింద బతుకు దెరువు కోసం కువైట్ వెళ్లాడు. క్లీనింగ్‌ అని ఏజెంట్‌ చెప్పినా అక్కడికి వెళ్లాక ఒంటెల కాపరిగా పనిలో పెట్టారు. ఏజెంట్‌ చేతిలో మోసపోయాయని గ్రహించిన నాందేవ్‌ ఎడారిలో చిక్కుకున్నానని కాపాడాలంటూ ఏడుస్తూ పంపిన వీడియో ఇప్పుడు వైరల్‌ మారింది. 

యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు. తనని ఏజెంట్ మోసం చేశాడని వాపోయాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని, కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను అక్కడ ఉండలేనని ప్రభుత్వ సాయం చేసి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. లేదంటే తనకు ఆత్మహత్యే దిక్కని వీడియోలో పేర్కొన్నాడు. అక్కడే ఉంటే బతకలేనని నాందేవ్‌ అంటున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాందేవ్‌ను తిరిగి రప్పించాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.