ట్రాఫిక్ పోలీసులను పరుగులు పెట్టించిన మందుబాబు - Drunker Fight With Police - DRUNKER FIGHT WITH POLICE
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 1:29 PM IST
Drunker Fight with Police While Drunk and Driving Time : మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చాలా వరకు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు సైతం బలికొంటున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మందుబాబులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో పట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ఛార్జ్షీట్లు దాఖలు చేస్తూ వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ సిటీలోని అంబర్‌పేటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. తాగి వాహనం నడపడమే కాకుండా, పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మందుబాబు బ్రీత్ అనలైజర్ ఊదకుండా పోలీసులను పరుగులు పెట్టించాడు. చివరకు అతన్ని పట్టుకొని టెస్ట్ చేసి, చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఎస్ఐ వీరమల్లు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేటప్పుడు పోలీసులకు సహకరించాలని వారు కోరారు.