హిట్ అండ్ రన్ కేసులో మార్పులను నిరసిస్తూ పలు చోట్ల డ్రైవర్ల ఆందోళన - Cab Drivers Protest for Hit and Run

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 4:29 PM IST

Drivers Protest against Hit and Run Case : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ కేసులో మార్పును నిరసిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఓరుగల్లు ప్రైవేట్ విద్యా సంస్థల డ్రైవర్స్ క్లీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల డ్రైవర్లు, క్లీనర్లు విధులను బహిష్కరించినట్లు తెలిపారు.

Auto and Cab Drivers Protest against Hit and Run Case : హైదరాబాద్‌ నారాయణగూడలో ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం వల్ల ప్రైవేటు రంగాలకు సంబంధించిన రవాణా సేవలు కూడా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, ఈ చట్టం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నిరసన వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.