ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? - లిమిట్‌కు మించి ఎక్కారని బస్సు ఆపేసిన డ్రైవర్ - RTC BUS STOPPED DUE TO OVER LOAD
🎬 Watch Now: Feature Video
Bus Was Stopped Due To Overload : మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకంతో బస్సులన్ని కిక్కిరిసిపోతున్నాయి. పెద్దఎత్తున ప్రయాణికులు బస్సులోకి ఎక్కటంతో ఆర్టీసీ సిబ్బందికి కొత్త చిక్కులొచ్చిపడుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి జనం ఎక్కడంతో తాను నడపలేనని డ్రైవర్ బస్సును నిలిపేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. 55 మంది ఉండాల్సిన బస్సులో 110 మంది పైగా ఉండటంతో నారాయణ అనే బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.
సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కరీంనగర్ నుంచి హుజురాబాద్ చేరుకున్న బస్సు అప్పటికే ప్రయాణికులతో నిండిపోయింది. హుజూరాబాద్ ప్రయాణ ప్రాంగణంలో బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. అదే బస్సులోకి ప్రయాణికులు ఎక్కారు. ఒక్క బస్సులో 55 మంది సామర్థ్యం ఉండగా, 110 మంది ప్రయాణికులు ఎక్కుతుండడంతో ఓవర్ లోడ్‌తో వెళ్లలేనని, కనీసం సైడ్ మిర్రర్ కనపడడం లేదని నడి రోడ్డు పై బస్సు ఆపి ఆవేదన వ్యక్తం చేశాడు. సైడ్ మిర్రర్ కనపడక ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దయచేసి కొంత మంది దిగాలని డ్రైవర్ ప్రయాణికులను కోరారు. డ్రైవర్ పరిస్థితిని అర్థం చేసుకున్న కొంతమంది ప్రయాణీకులు బస్సు దిగడంతో బస్సును యథావిధిగా వరంగల్‌కు తీసుకెళ్లారు.