వైద్య వృత్తి మహోన్నతమైంది- ఆరోగ్య విశ్వవిద్యాలయం 26వ కాన్వకేషన్‌లో గవర్నర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 7:33 PM IST

Dr Abdul Nazeer Speech In Health University Convocation Programme : ఔషధాలు రోగాన్ని నయం చేస్తే, వైద్యులు మనుషుల్ని బాగు చేస్తారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయ 26వ కాన్వకేషన్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైద్య వృత్తి మహోన్నతమైనదని, వైద్యులు నిరంతర ఆసక్తితో, నిత్య విద్యార్థిలా ఉండాలని సూచించారు. వైద్యరంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అభిలషించారు. (MBBS) ఎంబీబీఎస్​, పీజీ వైద్య విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. 

AP Governer Abdul Nazeer in Vijayawada : మానసిక వైద్యరంగంలో పలు అవార్డులు సాధించిన నిమ్ హాన్స్ డైరెక్టర్ ప్రతిమమూర్తికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. వైద్యులు చిత్తశుద్ధితో పని చేసినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నజీర్​ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.