హైదరాబాద్‌ను అభివృద్ధి చేయండి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టోద్దు: కూకట్పల్లి ఎమ్మెల్యే - MADHAVARAM KRISHNA RAO ON MUSI - MADHAVARAM KRISHNA RAO ON MUSI
🎬 Watch Now: Feature Video
Published : Oct 4, 2024, 3:25 PM IST
MLA krishna Rao on Musi River : హైడ్రా, మూసీ కూల్చివేతల విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. మూడు నెలల ముందే అఖిలపక్ష సమావేశం పెట్టి ఉంటే కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ మరణించేది కాదన్నారు. హైదరాబాద్‌లో ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం, సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన పూర్తి అవగాహనతో మాట్లాడాలని కృష్ణారావు సూచించారు.
60 నుంచి 70 ఏళ్లుగా నివాసముంటున్న వారి నుంచి అన్నీ పన్నులు వసూలు చేసి, ఇప్పుడు కబ్జాదారులు అనడం భావ్యం కాదన్న ఆయన వారిని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధి చేయండి కానీ హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టించవద్దని కోరారు. పద్ధతి ప్రకారం చేస్తే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ఓకటేనని అన్నారు. ఒక్క ఈటల మాత్రమే గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు, చేసిన కార్యక్రమాలనే కాంగ్రెస్ చెప్పుకుంటోందని ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఐదేళ్లలో కూకట్పల్లి నియోజకవర్గానికి కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని మాధవరం కృష్ణారావు చెప్పారు.