'వర్షాన్ని లెక్కచేయకుండా వాగులు, వంకలు దాటుతూ వైద్య సేవలు' - Medical Services in mulugu - MEDICAL SERVICES IN MULUGU
🎬 Watch Now: Feature Video


Published : Jul 17, 2024, 7:46 PM IST
Doctors Provided Medical Services : వైద్యో నారాయణో హరిః, వైద్యుడు భగవంతుడితో సమానం అని అర్థం. ఈ మాట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన సమాజంలో డాక్టర్లను గౌరవంగా చూస్తారు. ఆ పేరుకు తగ్గట్లుగానే ములుగు జిల్లా వైద్యులు చేసిన పని ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ములుగు జిల్లా పెనుగోలు గ్రామంలోని ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పైగా ఆ గ్రామం నుంచి రావాలంటే వర్షాలు అడ్డంకింగా మారాయి. దీంతో గ్రామస్థుల దగ్గరికే వైద్యులు వెళ్లారు. అందుకోసం కాలినడకన కొండలూ గుట్టలు దాటి కుండపోతగా కురిసే వర్షంలో తడస్తూ, ప్రమాదకరమని తెలిసినా లెక్క చేయక వాగులు దాటి వైద్య సేవలందించి శెభాష్ అనిపించుకుంటున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామస్తులకు జిల్లా వైద్యాశాఖాధికారి అప్పయ్య ఆధ్వర్వంలో వైద్య బృందం నిన్న వెళ్లి వైద్య సేవలందించారు. గ్రామంలో ప్రజలు ఆనారోగ్యం పాలయ్యారని తెలిసి, వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు సరఫరా చేశారు. సొంత ఖర్చులతో గ్రామస్తులందరికీ నిత్యావసర సామగ్రి ఇచ్చి ఇవాళ తిరుగుముఖం పట్టారు. ఓ వైపు కుండపోతగా వర్షంలోనూ ఛాతీకి పైగా లోతున్న వాగులను దాటి ములుగు కేంద్రానికి తిరుగుముఖం పట్టారు.