బోటి, తలకాయ కూర, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై - 'అలయ్ బలయ్'లో నోరూరించే తెలంగాణ వంటకాలు - SPECIAL FOOD IN ALAI BALAI
🎬 Watch Now: Feature Video
Published : Oct 13, 2024, 2:06 PM IST
Special Food Arrangements in Alai Balai : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో 'అలయ్ బలయ్' కార్యక్రమం ఘనంగా జరిగింది. అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం పెద్ద ఎత్తున శాఖాహార, మాంసాహార వంటకాలను సిద్ధం చేశారు. నోరూరించే తెలంగాణ సంప్రదాయ వంటలు, ప్రత్యేకించి చికెన్, మటన్ బిర్యానీ, చేపల పులుసు, చిరు ధాన్యాల ఉత్పత్తులు, గారెలు, జొన్న రొట్టె, ఇతర పిండి వంటకాలు సిద్ధం చేశారు. ఇవే కాకుండా బోటి, తలకాయ కూర, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై, నల్ల, పాయ వంటి దాదాపు 60 రకాల వంటకాలు సిద్ధం చేసినట్లు వంట నిర్వాహకులు తెలిపారు.
అలయ్ బలయ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది అలయ్ బలయ్‌లో పెట్టిన వంటకాలు ఇప్పుడు చూసేద్దాం.