మొసలికన్నీరు, దొంగ ఏడుపులతో మళ్లీ సానుభూతి పొందేందుకు జగన్ యత్నం: సత్యకుమార్ - Dharmavaram Mla Satya Kumar fire on jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 10:38 PM IST

thumbnail
మొసలికన్నీరు, దొంగ ఏడుపులతో ప్రజల్లో సానుభూతి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది : సత్యకుమార్ (ETV Bharat)

Dharmavaram Mla Satya Kumar Fire on Jagan : కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులు జరుగుతన్నాయంటూ వైసీపీ నేతలు రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం శాసనసభ్యులు వై.సత్యకుమార్‌ అన్నారు. మొసలికన్నీరు, దొంగ ఏడుపులతో ప్రజల్లో సానుభూతి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. వైసీపీ పాలనలో హత్య చేసి ఇంటికి శవాన్ని డోర్‌డెలివరీ చేశారని గుర్తుచేశారు. 

అలాగే ఓ వైద్యున్ని నడిరోడ్డుపై దారుణంగా కొట్టి అతని చావుకు కారణామయ్యారని మండిపడ్డారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారన్నారని వివరించారు. ఒకవేళ రాష్ట్రంలో మళ్లీ జగన్‌ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం రావణకాష్టంలా అయ్యేదని తెలిపారు. అలాంటి అరాచక మనస్తత్వం జగన్​లో ఇంకా కొనసాగుతోందన్నారు. మహాకూటమి పాలనలో ఆ విధంగా ఉండబోదన్నారు. జగన్‌ పాలనలో సాగిన అరాచక, అవినీతి, అస్తవ్యస్థ చర్యలకు చెంపపెట్టులాంటి తీర్పు ప్రజలు ఇచ్చారని సత్యకుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.