LIVE : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బకాయిలపై టీడీపీ నేత దేవినేని మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Devineni Uma press meet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 3:08 PM IST
|Updated : May 21, 2024, 3:21 PM IST
Devineni Uma Maheswara Rao press meet about Aarogyasri Pending Payments live : బకాయిలతో ఆరోగ్యశ్రీని జగన్ మోహన్ రెడ్డి నిరుగార్చరని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. దీనిపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామంటూ ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొందని తెలిపారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం లేఖ రాసింది. ఈ నెల 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తామని వెల్లడించిందని తెలిపారు. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నామని లేఖ రాసిందని వెల్లడించారు. పెండింగ్ బిల్లులు చెల్లించక పోవడంపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆస్పత్రులు సంఘం ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తామని పేర్కొందని గుర్తుచేశారు. 2023 ఆగస్టు నుంచి ఉన్న 1500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి చేస్తోంది. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలపాల్సి వస్తుందని ఆస్పత్రులు సంఘం పేర్కొందని తెలిపారు. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకూ 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లింపులు చేశారని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంది వెల్లడించారు. ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : May 21, 2024, 3:21 PM IST