LIVE : గాంధీభవన్‌లో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - BHATTI VIKRAMARKA press meet - BHATTI VIKRAMARKA PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Jul 14, 2024, 4:15 PM IST
|Updated : Jul 14, 2024, 4:38 PM IST
Deputy CM Bhatti Vikramarka Press Meet : రైతుబంధుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు వెనక్కి తీసుకోనున్నట్లు నిర్ణయం తీసుకుంది. రైతులకు పెట్టుబడిగా ఇచ్చే రైతు బందు ప్రతిఒక్కరికి అందించే దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అలాగే వచ్చే నేల 15లోపు రైతు రుణమాపీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్‌కు ఐదు ఎకరాలకు పైగా ఉన్న అన్నదాతలకు కూడా నిధులు విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించింది. నేరుగా కర్షకుల ఖాతాల్లోకి ఎకరానికి రూ.5 వేలు చొప్పున వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రైతుల ఖాతాలో డబ్బులు వేసేందుకు రూ.2 వేల కోట్ల మేరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలో 5 ఎకరాల మేరకు సాయం అందించాలని భావించింది. మిగిలిన రైతులు కూడా సాయం కావాలని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం తాజాగా వారికి కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించింది.
Last Updated : Jul 14, 2024, 4:38 PM IST