బీఆర్ఎస్, బీజేపీ కలిసి దేశాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నాయి : మంత్రులు భట్టి, పొంగులేటి - CONGRESS ELECTION CAMPAIGN - CONGRESS ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : Apr 30, 2024, 2:30 PM IST
Deputy CM Bhatti Fires On KCR : ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అమలు చేస్తున్న కార్యక్రమాలు కేసీఆర్‌కు కనిపించటం లేదా అని మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. అబద్ధాలతో మోసం చేయాలని చూసిన గులాబీ పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పినా ఇంకా మారలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని పదేళ్లలో ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి దేశాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నాయని అందుకే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మంత్రులు కోరారు.
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. బీజేపీతో, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి మళ్లీ మాయమాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అంబానీకి, ఆదానీకి ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేసిందని ఆరోపించారు.