LIVE : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీట్​ ది ప్రెస్​ - ప్రత్యక్షప్రసారం - Bhatti Vikramarka Interview - BHATTI VIKRAMARKA INTERVIEW

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 11:49 AM IST

Updated : Apr 19, 2024, 1:12 PM IST

Deputy Chief Minister Bhatti Vikramarka Interview : రాష్ట్రంలో తాజాగా నెలకొన్న విద్యుత్​, తాగునీరు, ఆర్థిక పరిస్థితులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. వేసవి కాలం వస్తుండడంతో అధిక విద్యుత్​ అవసరమవుతుంది. దీంతో 24 గంటల పాటు విద్యుత్​ ఇవ్వడానికి సరిపడిన మొత్తంలో విద్యుత్​ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవడంపై ఉపముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే విద్యుత్​ విషయంలో ప్రతిపక్షాల నోళ్లను పూసే పనిలో కాంగ్రెస్​ పడింది. ఎందుకంటే అసెంబ్లీలో విద్యుత్​ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసి అక్రమాలపై విచారణకు ఆదేశించింది. మరోవైపు వేసవి ఎద్దడి నుంచి గట్టేక్కెందుకు జలాశయాల్లోనూ, నదుల్లోనూ, చెరువుల్లోనూ నీటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని నీటి పారుదల అధికారుల ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్​లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని సూచించారు. సాగు, తాగు నీరు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. వాటన్నింటికీ బదులు చెప్పాలని ఉపముఖ్యమంత్రి కోరారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు.
Last Updated : Apr 19, 2024, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.