హుస్నాబాద్​లో నేషనల్​ హైవే విస్తరణ పనులు - రోడ్డుకు అడ్డంగా ఉన్న భవనాల కూల్చివేత - Building Demolished IN In Siddipet - BUILDING DEMOLISHED IN IN SIDDIPET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 8:21 PM IST

Demolition of Buildings Across the Road In Siddipet : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇండ్లను, దుకాణాలను, భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు వారిని అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు. యజమానులు అడ్డుకోవడంతో పోలీసుల బందోబస్తు మధ్య భవనాలను కూల్చివేస్తున్నారు.

మున్సిపల్ అధికారులను అడిగితే తమకు సమాచారం లేదని స్థానిక ఎమ్మార్వో వచ్చి తమపై దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు ఇంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయలేదని ముందు హుస్నాబాద్ పట్టణంలో భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు చేపడుతున్న జాతీయ రహదాపరి విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో 15 రోజుల్లో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. దీంతో అధికారులు రోడ్డు పనులు వేగవంతం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.