పత్తికొండలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలు - ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆత్మహత్యాయత్నం - Dalit Slogans against to ycp party
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 6, 2024, 10:05 PM IST
Dalit Leader Suicide Attempt in Pattikonda : కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మద్దికెరలో ఎస్సీలకు కేటాయిస్తామన్న ఇళ్ల స్థలాలను వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యంగా ఇతరులకు కేటాయించారని దళితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం దళితులకు వెంటనే ఇంటిపట్టాలు ఇవ్వాలని కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయమంటే వైసీపీ నాయకులు దౌర్జాన్యాలు చేస్తున్నారని వాపోయారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఏకమై ప్రభుత్వంపై దాడి చేస్తామని హెచ్చరించారు.
దళితులపైన దాడులు చేస్తే సహించేది లేదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం 28 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తే ఏ ఒక్క అధికారి, రాజకీయ నాయకుడు పట్టించకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అందరి సమక్షంలోనే ఎమ్మార్పీఎస్ నాయకుడు రాఘవేంద్ర పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.