తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్తం పేరిట సైకిల్‌ ర్యాలీ - జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల - Laddu Atonement Cycle Rally - LADDU ATONEMENT CYCLE RALLY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 7:26 PM IST

Cycle Rally in the Mame of Atonement for Tirumala Laddu Adulteration : తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై ప్రజలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

ప్రాయశ్చిత్తం పేరిట సైకిల్ ర్యాలీ : తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై ప్రాయశ్చిత్తం పేరిట గుడివాడ నుంచి ద్వారకా తిరుమలకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (MLA Venigandla Ramu) జెండా ఊపి ప్రారంభించారు. గోకవరపు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్యుల సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాసవీ చౌక్​లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుంచి ద్వారకా తిరుమల వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.