భూఅక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి : సీపీఐ నేత రామకృష్ణ - CPI Rama Krishna Comment - CPI RAMA KRISHNA COMMENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-08-2024/640-480-22130384-thumbnail-16x9-cpi-leader-rama-krishna.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 1:19 PM IST
CPI Leader Rama Krishna Comment on Land Irregularities in AP : రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లలో జరిగిన భూ అక్రమాలపై సమగ్రమైన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన స్థానికుల నాయకులతో సమావేశమయ్యారు. మదనపల్లిలో ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టారంటే భూ అక్రమార్కులు ఏ స్థాయికి వెళ్లారో అర్థమవుతుందన్నారు. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు వినిపిస్తోందని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి భార్య పేరు మీద వందల ఎకరాల భూములు ఉన్నట్టు తెలుస్తుందన్నారు. కేవలం ఒక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు.
ఏపీలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని బాధితులతో కలసి ఈ నెల 20న విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నట్టు రామకృష్ణ తెలియజేశారు. మరోవైపు రాయలసీమలో కరవు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం 20 వేలతో పాటు ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా ఇవ్వాలన్నారు.