ఆ ఇంటి ముందే వాలుతున్న రామచిలుకలు - దాణా వేయకపోతే అరుపులే అరుపులు - COUPLE FEEDING PARROTS EVERYDAY - COUPLE FEEDING PARROTS EVERYDAY
🎬 Watch Now: Feature Video
Published : Aug 12, 2024, 2:30 PM IST
Couple Feeding Birds Everyday in Metpally : రామచిలుకలకు ఆకలేసిందా అంతే సంగతి. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న విద్యుత్ తీగలపై వాలి అరుస్తుంటాయి. ఆ దంపతులు వచ్చి ఇలా ఇంటిగోడలపై ధాన్యాన్ని వేశారా అంతే చిటుక్కున వచ్చి వాలి కడుపు నింపుకుని పోతాయి. ఇలాంటి అరుదైన ఘటన జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లిలో చోటుచేసుకుంటుంది.
మెట్‌పల్లికి చెందిన దంపతులు దామోదర్, శారదలకు పక్షులు అంటే చాలా ఇష్టం. అయితే వీరు వాటికోసం ఇంటి గోడలపై ధాన్యాన్ని వేసేవారు. మొదట్లో ఏ పక్షులు వచ్చిన తినేవి కాదట. ఒకసారి మాత్రం ఒక చిలుక వచ్చి గోడపై ఉన్న బియ్యం, పప్పులు తిని పోయింది. మరునాడు దాంతో పాటు మరో నాలుగైదు చిలుకలను పట్టుకొచ్చింది. అవి కూడా కడుపు నింపుకుని పోయాయి. ఇలా రోజులు గడుస్తున్నా కొద్ది వాటి సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు రోజుకు దాదాపు వంద చిలుకలకు పైగా ఆ ఇంటిదగ్గరకు వచ్చి వారు వేసే ధాన్యాన్ని తిని వెళ్తాయి.
దంపతులు ఎప్పుడైనా కాస్త ఆలస్యం చేసినా ఇంటిచుట్టూరా ఉన్న విద్యుత్ తీగలపై వాలి అరుస్తాయి. దంపతులు వచ్చి ధాన్యం వేయగానే తినేసి వెళ్లిపోతాయి. ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వారు, స్థానికులు మురిసిపోతున్నారు. ఇలా జరగడం తమకు ఎంతో తృప్తిని ఇస్తుందంటున్నారు దామోదర్, శారద దంపతులు. వాటికి ఆహారం వేసిన తర్వాతనే తమ పనులు మొదలెడతామని చెబుతున్నారు. వాటికోం ప్రతిరోజు బియ్యం, పప్పు దినుసులు, నువ్వులు మొదలైనవి పెడతామని తెలిపారు.