వివాహితతో వాలంటీర్ వివాహేతర సంబంధం - ఆత్మహత్య చేసుకున్న జంట - Couple commits suicide in AP - COUPLE COMMITS SUICIDE IN AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 7:54 PM IST
Couple commits suicide over: అతను ఓ గ్రామ వాలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటి తీసుకెళ్లడం అతని బాధ్యత. కానీ, అతను అంతటితో ఆగలేదు, పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో ప్రేమలో పడ్డాడు. అందులో భాగంగా సంక్షేమ పథకాల పేరుతో ఆ మహిళ ఇంటికి వెళ్లేవాడు. తరచూ ఇంటికి వెళ్లడంతో, ఆ మహిళ అతని మాయలో పడింది ఆమెకు అప్పటికే పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నా, ఆమె అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇదే విషయం ఇంట్లో తెలిసింది. ఇరువురి ఇళ్లలో విషయం తెలిసిన నేపథ్యంలో వారు వారం రోజుల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయారు. తాజాగా నేడు గ్రామానికి తిరిగి వచ్చినా ఇరువురు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంట శివారులో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లికి చెందిన పోతిరెడ్డి సత్యనారాయణరెడ్డి (32), మృతురాలు విజయమ్మ (38)గా పోలీసులు గుర్తించారు. సత్యనారాయణరెడ్డి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్నారు. దీంతో సంక్షేమ పథకాల పేరుతో సదరు మహిళ ఇంటికి తరచూ వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకొని మహిళ భర్త మందలించాడు. దీంతో ఇరువురు వారం రోజుల క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయారు. గ్రామానికి వచ్చిన వారు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు విజయమ్మ ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని, వాలంటీర్ సత్యనారాయణరెడ్డికి ఇంకా వివాహాం కాలేదని పోలీసులు తెలిపారు.