ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత- ఆ ప్రాంతాల్లో పికెట్ : ఎస్పీ దీపికా - Counting Arrangements - COUNTING ARRANGEMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 5:08 PM IST
Counting Arrangements in Vizianagaram District : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు భద్రతా చర్యలన్నీ చేపట్టినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా చర్యలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా ఆమె వివరించారు. జిల్లాలో లెండి, జెఎన్టీయూ-గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు ఇతరాత్ర పర్యవేక్షణ కోసం స్థానిక పోలీసు బృందాలను నియమించామని ఎస్పీ తెలిపారు. ఫలితాల వెల్లడి తర్వాత ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 100 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పోలీసు పికెట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆయా గ్రామాల్లో పికెట్స్తో పాటు ఏదైన సంఘటన జరిగిన వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను సైతం నియమించామని తెలియచేశారు. ఎన్నికల తరహాలోనే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా పూర్తయ్యేలా జిల్లా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ దీపిక విజ్ఞప్తి చేశారు.