సిరిసిల్లలో కేటీఆర్, అవ్వ మధ్య ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్ - KTR conversation in Siricilla - KTR CONVERSATION IN SIRICILLA
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 3:18 PM IST
KTR MP Election Camapaign 2024 : వైద్య కళాశాల కోసం ఇచ్చిన తన రెండు ఎకరాల భూమి పోయిందని ఆ అవ్వ, కేటీఆర్‌కు చెబితే కలెక్టర్‌కు చెప్పి తగిన న్యాయం చేస్తానని చెప్పారు. అంతలోనే ఆ అవ్వ డబుల్ బెడ్‌రూం ఇంటి గురించి కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీనికి కేటీఆర్ ఇస్తానని అంటే ఎప్పుడు ఇస్తారు అంటూ ఠక్కున ఎంతో ఆప్యాయంగా అడిగింది. దీంతో అక్కడ ఉన్న కేటీఆర్‌తో సహా మిగిలిన వారంతా కొంతసేపు నవ్వుకున్నారు. అలాగే ఆ అవ్వ ఎక్కడా జంకకుండా మార్కెట్‌లో ఉన్న సమస్యల గురించి సవివరంగా భయం లేకుండా చెప్పింది.
ఈ సంభాషణ అంతా రాజన్న సిరిసిల్లలో ఉదయపు నడకకు వెళ్లిన కేటీఆర్‌కు వైద్య కళాశాల భూ నిర్వాసితురాలు లక్ష్మీకి మధ్య జరిగింది. వీరి మధ్య సాగిన ఈ సంభాషణ ఎంతో ఆసక్తిని గొలిపింది. మాజీ మంత్రి కేటీఆర్‌తో లక్ష్మీ ఆప్యాయంగా మాట్లాడుతూనే సమస్యలు ప్రస్తావించిన తీరు, అంతే ఆప్యాయంగా కేటీఆర్ స్పందించిన విధానం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఉదయపు నడకకు వెళ్లిన కేటీఆర్ ఓట్లును అభ్యర్థించారు.