సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో కాంగ్రెస్ జూనియర్ సీనియర్ నాయకుల మధ్య వాగ్వాదం - Clashes Between Cong Leaders - CLASHES BETWEEN CONG LEADERS
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 8:47 PM IST
Clashes Between Cong Mandal Leaders : రాష్ట్రంలో ఎన్నికల పవనాలు వీస్తున్నాయి. ఊరు వాడా అని తేడా లేకుండా అన్ని ప్రధాన పార్టీలు సభలు, ప్రచారాలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడ కొన్ని పార్టీల నాయకుల మధ్య అభిప్రాయబేధాలు వస్తున్నాయి. తాజాగా ఆ తరహా ఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ జూనియర్, సీనియర్ నాయకుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది.
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తుంగపర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షత వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన వారిని స్టేజి పైకి పిలిచి సీనియర్ నాయకులను అవమాన పరిచారని కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. కాంగ్రెస్ ముద్దు - బీఆర్ఎస్ వద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఎంత వారించినా వినకపోవడంతో సభ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి మద్దిరాల, నూతనకల్ మండలాల నాయకులు హాజరయ్యారు.