సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం - మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు : పల్లంరాజు - Congress Party vijayawada meeting

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 12:16 PM IST

Congress Party is Ready to Make a Manifesto : రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్​ పార్టీ దూకుడు పెంచింది. అందరి కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను రూపొందిస్తామని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వైజాగ్​ స్టీల్​ ప్లాంట్​, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. 

ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు ప్రత్యేక డిక్లేరేషన్లు, తెలంగాణ తరహాలో గ్యారెంటీలు రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పల్లంరాజు వెల్లడించారు. వివిధ వర్గాలు, రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగానే తమ మేనిఫెస్టో ఉంటుందని సృష్టం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్​ కాంగ్రెస్​ కార్యాలయంలో 11 మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, జేడీ శీలం, తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ తో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.