ఎంపీగా గెలిపిస్తే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తా : మల్లు రవి - Mallu Ravi about MP Elections - MALLU RAVI ABOUT MP ELECTIONS
🎬 Watch Now: Feature Video
Published : Mar 25, 2024, 10:47 PM IST
Congress MP Candidate Mallu Ravi on MP Elections : పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొచ్చేందుకు పార్లమెంట్లో కృషి చేస్తానని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రానున్న రోజుల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. నియోజకవర్గంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.
Mallu Ravi about Palamuru Rangareddy Project : అలంపూర్, కొల్లాపూర్ నాగర్ కర్నూల్ గుండా జాతీయ రహదారి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరుపుతున్నామని, తాను గెలిచిన వెంటనే నేషనల్ హైవే ప్రాజెక్టు అమలు చేయిస్తానని మల్లు రవి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని, దీని వల్ల బడుగు బలహీన వర్గాల వారు ఇబ్బందులకు గురవుతారని మండిపడ్డారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.