రూ.100 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ కాలువ అనుసంధానం పనులకు శంకుస్థాపన
🎬 Watch Now: Feature Video
Congress Ministers Foundation Stone For Sitarama Project Canal : సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా జలాశయానికి రూ.100 కోట్లతో నిర్మాణం చేయనున్న సీతారామ ప్రాజెక్టు అనుసంధాన కాలువ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లగా, అక్కడ ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రసంగించారు.
తన చిరకాల వాంఛ అయిన సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు తన వంతు కృషి చేస్తా అన్నారు. సభలోనే జలవనుల శాఖ రాష్ట్ర అధికారులతో మాట్లాడారు. జూన్ నాటికి అనుసంధాన కాల్వ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వైరా జలాశయాన్ని గోదావరి జలాలతో నింపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు సాగు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉంటారని అన్నారు. పనులు వేగవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్‌తో కలిసి తాను పర్యవేక్షిస్తూ ఉంటానని అధికారులకు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి గోదావరి జలాలు జలాశయంలో చేరే విధంగా అధికారులు ప్రణాళిక చేయాలన్నారు.