LIVE : గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం - Congress Leaders Press Meet - CONGRESS LEADERS PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : May 26, 2024, 4:04 PM IST
|Updated : May 26, 2024, 5:24 PM IST
Congress Leaders Press Meet at Gandhi Bhavan : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై చర్చించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని పిలువనున్నట్లు చెప్పారు. అలాగే ఆమెను సత్కరించనున్నామని తెలిపారు. జూన్ 2 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న అసత్య ప్రచారంపై కూడా వీరు మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా మంచిగానే జరుగుతున్నాయని, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వనున్నామని చెప్పారు. వడ్ల కొనుగోళ్లపై బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుందని ఇంతలోనే రెండు పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 కల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగింది.
Last Updated : May 26, 2024, 5:24 PM IST