ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతా : వి.హనుమంతరావు - Hanumantha Rao about Congress
🎬 Watch Now: Feature Video
Published : Feb 26, 2024, 5:41 PM IST
Congress Leader Hanumantha Rao about Khammam MP Seat : ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి తీరుతానని పీసీసీ మాజీ చీఫ్ వి. హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని, ఆ జిల్లా ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు వీహెచ్ తెలిపారు. అక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారని, పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడిన వాళ్లున్నారా అని ప్రశ్నించారు.
V.Hanumantha Rao about MP Elections : సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకముందని పీసీసీ మాజీ చీఫ్ వి. హనుమంతరావు పేర్కొన్నారు. తానేం తప్పు చేశానని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన నాయకులు టికెట్లు అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం తనపై పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలన్నారు. బీజేపీ నేతలు తమ భాషను మార్చుకోవాలని మండిపడ్డారు.