ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు - అద్దంకి దయాకర్ రియాక్షన్ ఏంటో చూడండి - Congress on MLAs Disqualification
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2024, 2:44 PM IST
Congress Leader Addanki on MLAs Disqualification Case : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తూ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతోనే రాష్ట్రంలో ప్రస్తుతం దుస్థితి నెలకొందన్న ఆయన, గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
సీఎల్పీని మెర్జ్ చేసుకోకునే వరకు హైకోర్టు ఆగకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యాలతోనే జరుగుతోందని పేర్కొన్నారు. మాజీమంత్రులు హరీశ్‌రావు ఒకవైపు, కేటీఆర్ మరోవైపు బీఆర్ఎస్‌ను పట్టించుకోకపోవడమే ఎమ్మెల్యేల మార్పునకు కారణమని విమర్శించారు.