నేను మాట్లాడితే దేవుళ్ల పేరిట రాజకీయం - మరి మీరు వేసే ప్రమాణాల సంగతేంటి? : బండి సంజయ్ - Bandi Sanjay Fires on Revanth Reddy - BANDI SANJAY FIRES ON REVANTH REDDY
🎬 Watch Now: Feature Video
Published : Apr 24, 2024, 4:50 PM IST
Bandi Sanjay Fires on Congress : తాను మాట్లాడితే దేవుళ్ల పేరిట రాజకీయం అంటున్న కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల హామీల అమలుకు ఒట్టు పెట్టుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామన్న కాంగ్రెస్ నేతలు, ధాన్యం కొనుగోళ్ల సమయంలో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం, పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయని కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తనను కరీంనగర్లో ఓడించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.