మున్సిపల్ సిబ్బందిపై కొబ్బరి బోండాల నిర్వాహకుల రాళ్ల దాడి - Attack on municipal staff - ATTACK ON MUNICIPAL STAFF

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 10:26 PM IST

Attack on Municipal Staff in Rajendranagar circle : ఫుట్​పాత్​పై ఉన్న కొబ్బరి బొండాల దుకాణాన్ని తొలగిస్తున్న క్రమంలో, మున్సిపల్​ సిబ్బందిపై రాళ్లతో దాడి చేసిన ఘటన రాజేంద్రనగర్​ సర్కిల్​ డెయిరీ ఫామ్​ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే రాజేంద్రనగర్​ సర్కిల్​ వద్ద ఉన్న ఫుట్​పాత్​పై గత కొన్ని రోజులుగా కొబ్బరి బొండాలు విక్రయిస్తున్నారు. ఫుట్​పాత్​పై కొబ్బరి బొండాలు విక్రయిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు జీహెచ్​ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఫిర్యాదు నమోదు చేసుకున్న అధికారులు, కొబ్బరి బొండాల బండిని తొలగించడానికి మున్సిపల్​ సిబ్బందిని పంపించారు. వ్యాన్​తో వచ్చిన జీహెచ్​ఎంసీ సిబ్బంది, కొబ్బరి బొండాలను బండిని తొలగిస్తుండగా, అకస్మాత్తుగా విక్రయదారులు వచ్చి సిబ్బందిపై దాడి చేశారు. విచక్షణారహితంగా రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. ఈదాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో మున్సిపల్​ సిబ్బందికి ప్రాణగండం తప్పింది. దాడి చేసిన వ్యక్తులపై మున్సిపల్​ సిబ్బంది రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికులను కాసేపు భయభ్రాంతులకు గురిచేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.