కోడిపుంజుకు చెవి దుద్దులు - గోళ్లకు నెయిల్ పాలిష్ - ముత్యాలమ్మ బోనాల్లో స్పెషల్ అట్రాక్షన్ - Cock Makeover in Bonalu Festival

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 10:41 AM IST

Cock Makeover in Bonalu Festival at Mahabubabad District : ముత్యాలమ్మకు బోనాల సమర్పణ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడు వినూత్న రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీనగర్​కు చెందిన తోడేటి వెంకటేశ్వర్లు కోడిపుంజుకు దుద్దులు కుట్టించి అలంకరించారు. కమ్మలతో, కాళ్ల గోళ్లకు నెయిల్ పాలిష్​తో అలంకరించడమే కాకుండా మెడకు మద్యంసీసా కట్టి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు.

అమ్మవారికి సమర్పించేందుకు చిన్న మద్యం సీసా కూడా తగిలించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బోనాల్లో ఈ కోడిపుంజుతో పలువురు యువకులు సెల్ఫీలు, ఫొటోలు దిగడం గమనార్హం. బోనాల పండుగలో  బుట్టాలతో అలంకరించిన ఈ కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొన్నేళ్లుగా ప్రతి బోనాల పండుగకు కోడిపుంజును ఇలాగే అలంకరించి తీసుకువస్తున్నట్లు భక్తుడు తోడేటి వెంకన్న తెలిపారు. ప్రస్తుతం ఈ కోడిపుంజు అలంకరణ వీడియోలు సోషల్​ మీడియాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.