బొగ్గు నుంచి గ్యాస్‌ ఉత్పత్తికి కృషి చేస్తున్నాం: కోల్ ఇండియా ఛైర్మన్‌ ప్రసాద్ - Coal Mines Management Conference

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 10:03 AM IST

Coal India Chairman PM Prasad Attended The Coal Mines Management Conference : దేశంలో వచ్చే 200, 300 ఏళ్ల వరకు బొగ్గు నిల్వలకు డోకా లేదని కోల్ ఇండియా ఛైర్మన్‌ పీఎం ప్రసాద్ చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల రీత్యా బొగ్గు వాడకం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తున్నామని తెలిపారు. బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తికి కృషి చేస్తున్నామని, 2030 నాటికి కార్యాచరణ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు జరగనుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన సదస్సుకు కోల్ ఇండియా ఛైర్మన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ప్రస్తుతం 30 మిలియన్ టన్నుల వరకు అండర్ ఓర్ మైనింగ్ జరుగుతుందని, 2030 నాటికి 100 మిలియన్ టన్నులకు పెంచాలనేది లక్ష్యంగా నిర్ణయించామని పీఎం ప్రసాద్ పేర్కొన్నారు. బొగ్గు గనుల్లో ప్రమాదాలను గణనీయంగా తగ్గించామని, గతంలో ఏటా 70 నుంచి 80 మంది ప్రమాదాలు జరిగి మృత్యువాత పడేవారని, గత ఏడాది ఈ సంఖ్య 28 తగ్గినట్లు తెలిపారు. బొగ్గు గనుల వెలికితీత, రవాణాలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నట్లు కోల్ ఇండియా ఛైర్మన్ పీఎం ప్రసాద్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.