ప్రత్యేక నిఘా, పటిష్ట భద్రత- చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ముమ్మరం - CM Swearing Ceremony Security - CM SWEARING CEREMONY SECURITY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 5:33 PM IST
CM Swearing Ceremony Security Arrangements : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లా కేసరపల్లి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. విజయవాడలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏలూరు వైపు నుంచి వచ్చేవి అవుటర్‌రింగ్ రోడ్డుకు మళ్లిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నాయకుల దగ్గర నుంచి స్థానిక నేతలకు మంచి భద్రతా నియమాలు పాటిస్తున్నామని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారం చూడాలనుకున్న ప్రజల కోసం పలు జిల్లాల వ్యాప్తంగా 11 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారని ప్రజలు ఎక్కడి వారి అక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చూడొచ్చు అంటున్నారు. VVIPలు బస చేసే హోటల్స్ వద్ద సైతం ప్రత్యేక నిఘా పెట్టారు. పాస్‌లు ఉన్న వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామంటున్న విజయవాడ సీపీ పీహెచ్‌డీ రామకృష్ణతో ఈ టీవీ ప్రతినిధి జయ ప్రకాష్ ముఖాముఖి.