అసెంబ్లీలో చంచల్‌గూడ Vs చర్లపల్లి జైలు అంశం - సీఎం రేవంత్‌కు జగదీశ్ రెడ్డి కౌంటర్ - telangana assembly 2024 - TELANGANA ASSEMBLY 2024
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 2:17 PM IST
CM Revanth vs Jagadish Reddy : శాసనసభలో పద్దులపై చర్చలో భాగంగా విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం సాగింది. నువ్వు జైలుకు వెళ్లావు అంటే లేదు నువ్వే జైలుకు వెళ్లావు అనే రీతిలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలా కేసీఆర్‌ను జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నారని దుయ్యబట్టారు.
సీఎం చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు జీవితం అనుభవాలను గుర్తు చేసుకుంటున్నట్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆయన చర్లపల్లి జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ ఉద్యమం సమయంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లింది మాత్రం గుర్తుందని, చర్లపల్లి జైలు సంగతి మరి ముఖ్యమంత్రికే తెలియాలి అంటూ కౌంటర్ వేశారు.