LIVE : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబానికి సీఎం రేవంత్ పరామర్శ - CM Revanth Visit Chintalakunta live - CM REVANTH VISIT CHINTALAKUNTA LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2024, 1:09 PM IST
|Updated : Sep 15, 2024, 1:14 PM IST
CM Revanth Reddy Visit to Chintalakunta Live : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం దమగ్నాపుర్ నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతికి కాంగ్రెస్ శ్రేణులు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నచింతకుంట మండలం దమగ్నపూర్లో నిర్వహించే కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక నేతలు సాదరంగా ఆహ్వానం పలికారు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో దేవరకద్రలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Last Updated : Sep 15, 2024, 1:14 PM IST