రోగుల జీవితాల్లో నవ్వులు పూయించడమే లక్ష్యంగా వైద్యులు పని చేయాలి : సీఎం రేవంత్ - Army College 18th Convocation
🎬 Watch Now: Feature Video
Published : Mar 7, 2024, 6:12 PM IST
Army College of Dental Sciences 18th Convocation : ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులంతా దేశవ్యాప్తంగా తమ విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రోగుల జీవితాల్లో నవ్వులు పూయించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 18వ స్నాతకోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో భాగంగా 15 మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, 38 మందికి బ్యాచిలర్ డిగ్రీలు అందజేశారు.
CM Revanth Reddy Participated Army College of Dental Sciences 18th Convocation : బెస్ట్ ఆల్‌రౌండ్ స్టూడెంట్‌గా డాక్టర్ శ్రేయా శుక్లా, బీడీఎస్‌లో ప్రతిభ కనబర్చిన డాక్టర్ హర్నూర్ దిలూన్, బెస్ట్ ఎండీఎస్ స్టూడెంట్‌గా ఎంపికైన డాక్టర్ అనుష్క మీనన్‌లకు మేజర్ జనరల్ రాకేశ్ మనోజాతో కలిసి సీఎం ట్రోఫీలు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అటు డాక్టర్లతో తమ వృత్తిలో ఎలాంటి అవినీతికి పాల్పడమని యాజమాన్యం ప్రతిజ్ఞ చేయించింది.