LIVE : శిల్పకళా వేదికలో కొలువుల పండుగ - ప్రభుత్వ ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ - Revanth Present to Appointment Doc - REVANTH PRESENT TO APPOINTMENT DOC
🎬 Watch Now: Feature Video
Published : Oct 6, 2024, 4:49 PM IST
|Updated : Oct 6, 2024, 5:41 PM IST
CM Revanth is Presenting Appointment Documents in Hyderabad : ఇటీవల రాష్ట్రంలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 1635 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి నియామక పత్రాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా జరుగుతుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రెరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సహా ఇతర శాఖల్లో ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న ముఖ్యమంత్రి, డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని సెప్టెంబరు 25న జరిగిన సమావేశంలో తెలిపారు. త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఏటా 3లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారన్న రేవంత్, ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడినట్లు వివరించారు. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని పరిశ్రమల యజమానులను అడుగుతున్నామని, అందుకు తగ్గట్టుగానే నిరుద్యోగ యువత డిమాండ్-సప్లయ్ సూత్రం గుర్తుంచుకోవాలన్నారు.
Last Updated : Oct 6, 2024, 5:41 PM IST