LIVE : డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ - REVANTH DSC APPOINTMENT ORDERS LIVE
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2024, 4:34 PM IST
|Updated : Oct 9, 2024, 5:39 PM IST
Revanth Gives Appointment Orders to DSC Candidates Live : రాష్ట్రంలో దసరా వేడుకకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందిస్తున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో దాదాపు పదివేల మందికిపైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయటంతోపాటు బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. నియామక పత్రాలు అందుకునే వారు, వారి కుటుంబసభ్యులతో ఎల్బీ స్టేడియం కళకళలాడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16వేల కానిస్టేబుల్ పోస్టులు నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయటంతో పాటు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసి గ్రూప్స్ పరీక్షలను సైతం నిర్వహించింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీని ప్రకటించారు. 11,062 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టిన సర్కారు కేవలం ఏడు నెలల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈరోజు దాదాపు పది వేల మందికి పైగా నియామకపత్రాలను అందిస్తోంది.
Last Updated : Oct 9, 2024, 5:39 PM IST