LIVE : ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి - gurukula job appointment letters
🎬 Watch Now: Feature Video
Published : Mar 4, 2024, 5:06 PM IST
|Updated : Mar 4, 2024, 5:40 PM IST
CM Revanth LIVE : కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5192 మందికి, సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియాన్ని అందంగా అలంకరించారు. ఇంతకు మునుపే పరీక్షలు నిర్వహించి కోర్టు కేసులతో, వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిని పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది సివిల్ పోలీసులు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా మూడు వందల మంది ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ నియామక ప్రక్రియ చేపట్టింది. గత సంవత్సరం వివిధ శాఖలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలను అందజేస్తున్నారు.
Last Updated : Mar 4, 2024, 5:40 PM IST