అనకాపల్లికి మహర్దశ - ఆరు లేన్ల రహదారి, సెజ్! - Development of Anakapalli
🎬 Watch Now: Feature Video
CM Ramesh Explained about Development of Anakapalli Parliament : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని యువతకు ఉద్యోగ అవకశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఇచ్చి కూటమి ప్రభుత్వ విజయానికి కారణమైన ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని మాడుగుల, చోడవరం నియోజకవర్గంలో 5 వేల ఎకరాల్లో సెజ్ (SEZ) ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనకాపల్లి - రాజమండ్రి జాతీయ రహదారిని విస్తరించేలా త్వరలోనే పనులు చేపడతామని వివరించారు.
అలాగే పార్లమెంటు పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్ర సహకారం కోరతామని వెల్లడించారు. అందుకోసం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలందరూ కలిసి కేంద్ర మంత్రులను కలుస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల నుంచి ఎంపీ ల్యాండ్స్ నిధులు వస్తాయన్నారు. వాటితో పార్లమెంటు పరిధిలోని వెయ్యి గ్రామాలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని సీఎం రమేష్ హామీ ఇచ్చారు.