Watchmen and Staff Became Doctors and Treated Patients : ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏకంగా వాచ్మెన్, సిబ్బందే డాక్టర్లుగా అవతారమెత్తారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు, గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేసి ఇంజక్షన్లు ఇచ్చారు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజులో వెలుగుచూసింది. వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో అక్కడ పని చేసే సిబ్బందే డాక్టర్లుగా మారి వైద్యం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని బట్టి చూస్తే ఆసుపత్రిలో రోజూ ఇదే తంతు జరుగుతుందా? అనే అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్య వైద్యానికి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడుతున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ అవతారమెత్తిన వాచ్మెన్ - మెడికల్ చెకప్‌లతో పాటు ఇంజక్షన్లు చేస్తూ! - WATCHMEN TREATED PATIENTS
వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లుగా మారిన వాచ్మెన్, సిబ్బంది - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 17, 2024, 10:20 PM IST