జగన్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం - ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించిన స్థానికులు - CM Jagan visit kakinada - CM JAGAN VISIT KAKINADA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 1:18 PM IST
CM Jagan Election Campaign Samarlakota in Kakinada District : కాకినాడ జిల్లాలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థుల నుంచి ఆసుపత్రికి వెళ్లే రోగుల వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు.
పోలీసుల ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రయాణికులు గంటల తరబడి ఎండలోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించిన ప్రయాణికులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులు పరీక్షలు అవుతున్నాయి, పాఠశాలకు తీసుకు వెళ్లడానికి దారి ఇవ్వాలంటూ అడిగిన ఆటో డ్రైవర్ను ఓ కానిస్టేబుల్ పక్కకు నెట్టేశారు. ఎవరో వస్తున్నారని మాకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.