LIVE: బుడమేరు గండిపడిన ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu Visit Flooded Areas - CM CHANDRABABU VISIT FLOODED AREAS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 10, 2024, 5:08 PM IST
|Updated : Sep 10, 2024, 6:01 PM IST
CM Chandrababu Visit Flooded Areas LIVE : బుడమేరు గండిపడిన ప్రదేశాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. కాలినడకన వెళ్లి గండ్లు పూడ్చిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి సీఎంకు అధికారులు వివరిస్తున్నారు.CM Chandrababu on Relief Operations : వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలని, ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా ఎమ్యునరేషన్ జాగ్రత్తగా చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ రోజు సాయంత్రానికి నగర వీధుల్లో ఉన్న నీళ్లన్నీ క్లియర్ అయిపోవాయని, పారిశుధ్యం పనులు నిరంతరం కొనసాగాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతోందని, నేటి సాయంత్రానికి సరుకుల పంపిణీ కూడా పూర్తి చేయాలని తెలిపారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలుగుతామని చంద్రబాబు అన్నారు. తమ రాష్ట్రం తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతమని, దానికి అనుగుణంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Last Updated : Sep 10, 2024, 6:01 PM IST