Live : కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రులు - CM Cabinet Meeting Completed Live
🎬 Watch Now: Feature Video
Published : Mar 12, 2024, 5:51 PM IST
|Updated : Mar 12, 2024, 6:11 PM IST
Telanagana Cabinet Meeting Completed Live : లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇవాళ రాష్ట్రమంత్రి వర్గం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో కొత్తగా ప్రారంభించబోయే పథకాలపై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ పథకాలపై త్వరలో జీవో జారీ చేస్తామని మంత్రి మండలి భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. పైరవీలకు తావు లేకుండా ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి విడతగా 4లక్షల 56వేల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మరికొన్ని గ్యారెంటీలు కూడా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇవాళ రాష్ట్రమంత్రి వర్గం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో కొత్తగా ప్రారంభించబోయే పథకాలపై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ పథకాలపై త్వరలో జీవో జారీ చేస్తామని మంత్రి మండలి భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
Last Updated : Mar 12, 2024, 6:11 PM IST