నంద్యాల వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు - ఎమ్మెల్యే శిల్పాపై జడ్పీటీసీ ఆగ్రహం - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 9:33 AM IST
Class Differences in Nandyala YSRCP Leaders : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్సార్సీపీలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా పుట్టగొడుగుల్లా బయటకు వస్తున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్యహిస్తున్నారు. నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యం ఇవ్వకున్నా, సమస్యలకు పరిష్కారం చూపెట్టకపోయిన పార్టీని వీడి ప్రత్యేక కార్యచరణ చేపడతామని సీఎం జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా నంద్యాలలో అధికార వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోతో గొడవలు బయటపడ్డాయి. అసభ్య పదజాలంతో ఉన్న ఆ వీడియోపై నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు గోకుల్ కృష్ణా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ యాత్ర నిర్వహించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని గోకుల్ కృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని ఉద్దేశించి ఎమ్మెల్యే శిల్పా రవి అన్నాడో చెప్పాలని కోరారు. పార్టీ ప్రతిష్ఠ దిగజార్చేలా రవిచంద్రకిషోర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని గోకుల్ కృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. స్థానికంగా వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి జగన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.