రోడ్డు ప్రమాదాల వల్ల తమ ప్రాణాలే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు కారకులవుతున్నారు : మహేశ్​ భగవత్ - Mahesh Bhagwat on Road Safety

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 9:38 AM IST

ICICI Lombard Ride to Safety Rally in Hyderabad : సెల్ ఫోన్​ డ్రైవింగ్​, డ్రంక్ అండ్ డ్రైవ్​ వస్స వాహనదారులు తమ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రైల్వే, రహదారి భద్రతా అధికారి మహేశ్​ భగవత్ అన్నారు. ఈ నెల 3వ తేదీన ఐసీఐసీఐ లాంబార్డ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్ మీర్​పేట్​ పరిధిలోని జిల్లెల్లగూడలో జరిగిన 'రైడ్ టు సేఫ్టీ' ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Mahesh Bhagwat about Right to Safety Rally : రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అదేవిధంగా ప్రమాదంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాల్సిన అవసరం ఉందని అడిషన్​ డీజీపీ మహేశ్​ భగవత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ లాంబార్డ్ సీనియర్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి ద్విచక్ర వాహనదారులకు రోడ్డు-భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 500పైగా పిల్లల తల్లిదండ్రులకు ఐఎస్​ఐ గుర్తు ఉన్న హెల్మెట్లను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.